Header Banner

ట్రంప్ సర్కార్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. అమెరికాలో వలసదారులకు భారీ షాక్! 5 లక్షల మందికి పైగా..

  Sat May 31, 2025 11:33        U S A

అమెరికాలో లక్షలాది మంది వలసదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన 5 లక్షల మందికి పైగా వలసదారులకు మానవతా దృక్పథంతో కల్పించిన పరోల్ (తాత్కాలిక వలస) రక్షణలను రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో పాటు, మరో కేసులో సుమారు 3,50,000 మంది వెనిజులా వలసదారులకు కల్పించిన తాత్కాలిక చట్టబద్ధ హోదాను కూడా రద్దు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఈ పరిణామాలతో దాదాపు పది లక్షల మంది వలసదారులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానిక మీడియా శుక్రవారం నివేదించింది. అమెరికా-మెక్సికో సరిహద్దులకు వస్తున్న వలసదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బైడెన్ ప్రభుత్వం 2022 చివరలో ఈ మానవతా పరోల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

దీని కింద వలసదారులకు రెండేళ్లపాటు అమెరికాలో పనిచేసుకునేందుకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5,32,000 మందికి బహిష్కరణ నుంచి రక్షణ లభించింది. అయితే, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, అన్ని పరోల్ కార్యక్రమాలను రద్దు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్‌ను ఆదేశిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వు మేరకు క్రిస్టీ నోయెమ్ మార్చి నెలలో పరోల్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 24 నాటికి అమల్లో ఉన్న పరోల్ అనుమతుల గడువు ముగుస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 23 మంది వ్యక్తులు, పలువురు పరోల్ పొందినవారు, ఒక స్వచ్ఛంద సంస్థ మసాచుసెట్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వలసదారుల తాత్కాలిక హోదా రద్దును నిలిపివేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ట్రంప్ ప్రభుత్వం మొదట ఫస్ట్ సర్క్యూట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో దీనిని సవాలు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, దిగువ కోర్టు ఉత్తర్వులను ఎత్తివేసింది.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Usa #DonaldTrump #USSupremeCourt #Immigration #Paroleprogram #Migrants #UnitedStates #Cuba #Haiti #Nicaragua #Venezuela